కింగ్ మేకర్ తో మెగా స్టార్..పవర్ స్టార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివాదం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొలువు తీరారు. వీరితో పాటు మరో 24 మందికి కేబినెట్ లో చోటు కల్పించారు ఎన్డీయే కూటమి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
అంతకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా , జేపీ నడ్డా తో పాటు బీఎల్ సంతోష్ సుదీర్ఘంగా కసరత్తు చేశారు. చివరకు ఏపీ కేబినెట్ ను ఖరారు చేశారు బాబుతో సమన్వయం చేసుకున్నారు. ఇందులో ముగ్గురికి జనసేన పార్టీ తరపున అవకాశం కల్పిస్తే ఒకరికి భారతీయ జనతా పార్టీ నుంచి ఛాన్స్ లభించింది.
సభా వేదికపై రాజకీయ, సినీ ప్రముఖులు కొలువు తీరారు. మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే , కేంద్ర మంత్రులు రామ్ దాస్ అథావలే , చిరాగ్ పాశ్వాన్ , అనుప్రియా పటేల్ , షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, మాజీ దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కొలువు తీరారు.
ఇదిలా ఉండగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి. పవన్ కళ్యాణ్ వస్తూనే తన అన్న కాళ్లు మొక్కాడు. అక్కడి నుంచి ప్రధాని మోడీతో ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ కోరారు. మోడీ పవన్ చేయి పట్టుకుని చిరంజీవి వద్దకు వచ్చారు. ముగ్గురూ కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.