చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారం
28న అందజేయనున్న అమితాబ్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు పేరు మీద ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తెలుగు సినీ రంగానికి చెందిన మెగా స్టార్ చిరంజీవికి అందజేయనున్నట్లు ప్రకటించారు ఏఎన్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు.
ఇందుకు సంబంధించి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు దివంగత అక్కినేని తనయుడు, ప్రముఖ నటుడు, బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున. ప్రతి ఏటా తన తండ్రిని స్మరించుకుంటూ అవార్డును ప్రధానం చేయడం జరుగుతోందని తెలిపారు.
ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవిని కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ 28న జరుగుతుందని తెలిపారు అక్కినేని నాగార్జున.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ సినీ దిగ్గజం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హాజరవుతారని స్పష్టం చేశారు. ఏఎన్ఆర్ అవార్డును బిగ్ బీ మెగాస్టార్ చిరంజీవికి అందజేయనున్నట్లు చెప్పారు నటుడు.
అక్కినేని నాగేశ్వర్ రావు అభిమానులతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు అక్కినేని నాగార్జున.