కరెంట్ ఛార్జీల మోత సర్కార్ వాత
రూ. 6,072 కోట్ల భారం మోపనున్న బాబు
అమరావతి – మాజీ మంత్రి , బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఆయన చెప్పింది ఏదీ చేయడని అన్నారు. కేవలం మాటలు, ప్రచారం తప్పా ఒక్క మంచి పని చేసిన పాపాన పోలేదన్నారు.
ప్రజలను నిట్ట నిలువునా ముంచేందుకు ప్లాన్ రెడీ చేశాడని ఆరోపించారు. సిక్స్ గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించాడని, ఇప్పుడు జనం నెత్తిన శఠగోపం పెట్టేందుకు రెడీ అయ్యాడని మండిపడ్డారు మేరుగు నాగార్జున.
తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ చెప్పిన చంద్రబాబు ప్లేట్ ఫిరాయించాడని ఆరోపించారు. ఏకంగా విద్యుత్ వినియోగదారులపై రూ. 6,072 కోట్ల భారం మోపేందుకు సిద్దం అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు మేరుగు నాగార్జున. యూనిట్ మీద రూ.1.58 పైసలు పెంచుతూ నవంబర్ నుంచి బాదేందుకు సిద్దం చేశాడని ఫైర్ అయ్యారు. మాటలు చెప్పడం, హామీలు ఇవ్వడం ఎన్నికల తర్వాత తెప్ప తగలేయడం బాబు నైజం అన్నారు.