రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు షురూ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఫేస్ బుక్ జుకర్ బర్గ్ కు చెందిన వాట్సాప్ తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్రంలో పౌరులకు సంబంధించిన 161 సేవలను వాట్సాప్ ద్వారా అందనున్నాయి. సీఎంను కలిసిన వారిలో మెటా ఇండియా ఉపాధ్యక్షురాలు సంధ్య దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, మెటా స్ట్రాటజిక్ ప్రొగ్రామ్స్ అండ్ పార్టనర్‌షిప్స్ చీఫ్ దివ్య కెమనీ ఉన్నారు.
మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు. సేవలకు సంబఃధించి 9552390009 నెంబర్ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పౌర సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయశాఖ, ఎనర్జీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్ వంటి పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక రెండో దశలో 300కు పైగా సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్.
తమ ప్రభుత్వం అత్యంత వేగంగా ప్రజలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగానే దిగ్గజ సోషల్ మీడియా, ఐటీ సంస్థ ఫేస్ బుక్ మెటా తో ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వాట్సాప్ ఈ గవర్నెన్స్ సేవల వల్ల విలువైన సమయం వృధా కాదన్నారు. క్షణాల్లోనే పూర్తి పారదర్శకంగా సేవలు అందుబాటులోకి వస్తాయని, మధ్య దళారీల ప్రమేయం ఎంత మాత్రం ఉండదన్నారు. తమ సేవలకు సంబంధించి ఎలాంటి డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సిన పని లేదన్నారు నారా లోకేష్.