31న మెట్రో రైళ్ల టైమ్ పొడిగింపు
ప్రకటించిన మెట్రో ఎండీ
హైదరాబాద్ – ప్రపంచ వ్యాప్తంగా 2025 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు చెప్పింది మెట్రో రైల్. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 1.15 వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని మెట్రో ఎండీ కోరారు.
ఇదిలా ఉండగా న్యూ ఇయర్ వేడుకలపై నిఘాను పెంచారు పోలీసులు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ గా కీలక ప్రకటన చేశారు. నియమ నిబంధనలు ఎవరైనా సరే పాటించాలని స్పష్టం చేశారు. గీత దాటితే చర్యలు తప్పవని అన్నారు. జీవితం విలువైనదని, వేడుకల్లో పాల్గొనడంలో తప్పు లేదని కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రత్యేకించి పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నగర భద్రత అత్యంత ముఖ్యమని అన్నారు. ఇందులో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీపీ సీవీ ఆనంద్. మైనర్లను బయటకు వెళ్లకుండా పేరెంట్స్ చూసుకోవాలని స్పష్టం చేశారు. లేకపోతే పేరెంట్స్ కు కూడా కోటింగ్ ఇస్తామన్నారు.