హైదరాబాద్ జోరు ముంబై హుషారు
ముంబై వేదికగా నేడే బిగ్ ఫైట్
ముంబై – ఐపీఎల్ 2024 టోర్నీ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు పేలవమైన ఆట తీరుతో నిరాశ పరుస్తోంది. ఇక గత సీజన్ లో ఆశించిన మేర రాణించని సన్ రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్ సారథ్యంలో దుమ్ము రేపుతోంది. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతోంది.
పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టును తన అద్భుతమైన ఆట తీరుతో కట్టడి చేసింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడించింది. ఒక రకంగా చుక్కలు చూపించింది. ఇక ప్లే ఆఫ్స్ రేసుకు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సి ఉంది ముంబై జట్టుకు.
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో తడబడుతోంది. ప్రధానంగా ఏరికోరి పాండ్యాను తీసుకుంది ముంబై జట్టు యాజమాన్యం. ఆశించిన మేర రాణించడం లేదు. ఆల్ రౌండ్ షోతో అదుర్స్ అనిపిస్తాడని భావిస్తే చివరకు తుస్సు మంటూ నిరాశ పర్చడం కొంత ఆందోళన కలిగిస్తోంది.
మే 6న ముంబైతో తల పడుతోంది సన్ రైజర్స్. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక తమ స్వంత మైదానంలోనైనా ముంబై ఇండియన్స్ దుమ్ము రేపుతారని భావిస్తున్నారు.