NEWSANDHRA PRADESH

సాంకేతిక లోపం ఫ్లైట్స్ ఆల‌స్యం

Share it with your family & friends

గన్న‌వ‌రం ఎయిర్ పోర్టులో ఇబ్బంది

అమ‌రావ‌తి – ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ లో ఏర్ప‌డిన సాంకేతిక లోపం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టేలా చేస్తోంది. ప‌లు దేశాల కార్య‌క‌లాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. భార‌త దేశంపై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపింది. ఇదే ఎఫెక్ట్ ఏపీపై కూడా ప‌డింది. రాష్ట్రానికి కీల‌కంగా మారిన గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు ప్ర‌యాణీకులు.

సాంకేతిక లోపం కార‌ణంగా గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి ప‌లు స‌ర్వీసులు ఆల‌స్యం అయ్యాయి . మైక్రో సాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సాఫ్ట్వేర్ సర్వర్లు.దీని వలన పలు విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. బోర్డింగ్ ప్రాసులపై, మాన్యువల్ గా రాసి పంపించడం జరుగుతోంది.

ఈ సంద‌ర్బంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఏకే లక్ష్మీ కాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి రోజు గన్నవరం నుండి 23 విమాన సర్వీసులు వివిధ ప్రదేశాలకు బయలుదేరి వెళ్ళవలసి ఉన్నాయ‌ని తెలిపారు.

ఇప్పటి వరకు 13 విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయ‌న్నారు. 7 విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయ‌ని తెలిపారు. ఇదే ఆలస్యం సాయంత్రం వరకు కొనసాగితే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

క్లౌడ్ సర్వర్, మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో విమాన సర్వీసులకు ఇదే పరిస్థితి నెల‌కొంది. ఇప్పటికే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు, మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నారు..

గన్నవరం విమానాశ్రయంలో టికెట్ల కౌంటర్లో ప్రయాణికులకు టికెట్లు నిలిపి వేశారు. ఇదే ప్రాబ్లం రెండు మూడు రోజులు కొనసాగితే, విమాన సర్వీసులు నడపడం కష్టమ‌న్నారు డైరెక్ట‌ర్.