పైలెట్ ప్రాజెక్టు కింద అదానీకి ఇస్తే ఎలా
నిప్పులు చెరిగిన ఎంఐఎం ఎమ్మెల్యే ఓవైసీ
హైదరాబాద్ – రాష్ట్ర శాసన సభలో తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులను కూడా ఏకి పారేశారు.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గురించి ప్రస్తావించారు ఎమ్మెల్యే ఓవైసీ. అదానీకి పాత బస్తీలో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎలా కేటాయిస్తారంటూ నిలదీశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎవరికి చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశ్నించారు.
ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే, అదానీపై అంత ప్రేమ ఉంటే ముందు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెట్టొచ్చని, లేదా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు నియోజకవర్గాల్లో ఎందుకు పెట్టలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అక్మరుద్దీన్ ఓవైసీ.
సీఎం ఓ మాట మాట్లాడుతున్నాడని మంత్రులు మరో మాట చెబుతున్నారని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు .