మంత్రి అనగాని సత్య ప్రసాద్
అమరావతి – బీసీలకు చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని అన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. సీఎస్ గా నియమితులైన కె. విజయానంద్ ను అభినందించారు. టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు, టీటీడీ ఈవోగా జె. శ్యామల రావులను నియమించడం బీసీల పట్ల తనకున్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. అత్యున్నతమైన పదవులలో బీసీలకే ప్రయారిటీ ఇచ్చారని తెలిపారు.
ఇదిలా ఉండగా బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ సీనియర్ ఐఏఎస్ గా ఉన్నారు. ఎన్నో పదవులు చేపట్టారు. ఆయన చేపట్టిన ప్రతి పదవికి వన్నె తీసుకు వచ్చారు. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం డిసెంబర్ తో పూర్తికానుంది.
చంద్రబాబు నాయకత్వంలో బిసిలకు మరో సారి పెద్దపీట వేశారని పేర్కొన్నారు అనగాని సత్య ప్రసాద్. 1992 బ్యాచ్ కు చెందిన బిసి అధికారికి టాప్ పోస్ట్ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. బిసి నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం ఇవ్వడం గర్వకారణమన్నారు. తొలి సారి బిసి అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా అవకాశం కల్పించిన సిఎంకు ధన్యవాదాలు తెలిపారు.