త్వరలో టీటీడీ పాలక మండలి నియామకం
ప్రకటించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని తెలిపారు.
త్వరలోనే టీటీడీకి సంబంధించి నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ పరంగా అందరి అభిప్రాయాలు, సూచనలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు ఆనం రామ నారాయణ రెడ్డి.
ఏపీ మంత్రి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పరకామణి దొంగతనం కేసుకు సంబంధించి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ విచారణ సాగిస్తుందని చెప్పారు. నివేదిక అందిన తర్వాత ఎంతటి వారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు . శిక్ష నుంచి తప్పించు కోలేరని హెచ్చరించారు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం పాలనా పరంగా గాడిలో పెట్టామని చెప్పారు. ఈవోను మార్చడం జరిగిందని, కొత్తగా అదనపు ఈవోను కూడా నియమించడం జరిగిందన్ఆనరు ఆనం రామ నారాయణ రెడ్డి.