పలు సమస్యలపై విన్నపాలు
అమరావతి – బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు మంత్రి వంగలపూడి అనిత. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి, అనుచరులు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పెద్ద ఎత్తున బాధితులు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారని తెలిపారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని, ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి.
గత పాలకులు ఆ పార్టీ నేతలు ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేయడమే కాకుండా వారే భూ భకాసురులై ప్రజల భూములను కబ్జా చేశారని ఆరోపించారు వంగలపూడి అనిత. ప్రశ్నించిన పేదలపై దాడులు చేశారని అన్నారు.
ఆనాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మూగబోయిన బాధితుల గొంతులకు కూటమి ప్రభుత్వం నేడు ఊపిరైందన్నారు. అందుకే తమ సమస్యలను వినిపించేందకు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు క్యూ కడుతున్నారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనితతో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబుకు ఆర్జీలు సమర్పించారు.