జాబ్స్ హబ్ గా ఏపీని మారుస్తాం
మంత్రి వంగలపూడి అనిత ప్రకటన
అమరావతి – ఏపీని జాబ్స్ ను సృష్టించే హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు మంత్రి అనిత వంగలపూడి. శనివారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో పాయకరావుపేటలోని స్పేసెస్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా చేపట్టారు.
ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనిత వంగలపూడి. ఇందులో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. 1000 మందికి పైగా జాబ్స్ ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. ఈ సందర్బంగా మంత్రి ప్రసంగించారు. మరికొన్ని కంపెనీలను తీసుకు వస్తామని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా కోర్సులను నేర్చుకోవాలని సూచించారు. కష్టపడి చదివితే సక్సెస్ వస్తుందన్నారు. తాను కూడా ఒకప్పుడు చదువుకునేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు మంత్రి.
రాబోయే రోజుల్లో దిగ్గజ కంపెనీలు ఏపీలో కొలువు తీరేలా సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. గూగుల్, టీఎస్ఎస్ కంపెనీలు విశాఖకు రానున్నాయని తెలిపారు.