నకిలీ ఐపీఎస్ హల్ చల్ పై సీరియస్
విచారణకు ఆదేశించిన మంత్రి అనిత
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన పట్ల మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో వై సెక్యూరిటీ కన్ను గప్పి ఓ నకిలీ ఐపీఎస్ ప్రవేశించాడు. ఆపై హల్ చల్ చేశాడు.
అంతే కాకుండా సెక్యూరిటీ సిబ్బందితో సెల్ఫీలు దిగాడు. ఆపై సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు వంగలపూడి అనిత. తక్షణమే ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఎక్కడ పొరపాటు జరిగిందో వివరణ ఇవ్వాలన్నారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించినా ఎలా లోపలికి వచ్చాడని ప్రశ్నించారు. భద్రతా లోపాలపై ఫైర్ అయ్యారు. ఎస్పీ ఏం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్. ఆయన వచ్చిన సమయంలో వెన్నంటే ఉన్న నకిలీ ఐపీఎస్ ఆఫీసర్. టూర్ అయ్యాక ఫోటోలు బయటకు రావడంతో విచారణ చేపట్టిన మన్యం జిల్లా పోలీసులు. నకిలీ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు విజయనగరం రూరల్ పోలీసులు.