తప్పని తేలితే చర్యలు తప్పవు
మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – సబ్ జైలులో ఉన్న అధికారులపై ఆరోపణలు వచ్చాయని, విచారణ జరిపిస్తున్నామని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. ఒకవేళ తప్పని తేలితే పోలీసులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. ఎంపీ విజయ సాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.
సబ్ జైలులో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావడం జరిగిందన్నారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.
ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని , తన స్థాయికి తగిన రీతిలో ఆయన వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. కాకినాడ పోర్టు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు.
వైసిపి నేతలు గత ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను జగన్ రెడ్డి , కంపెనీ దోచుకుంందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి, హక్కు ఎంపీ విజయ సాయి రెడ్డికి లేదన్నారు వంగలపూడి అనిత.
అధికారులను బెదిరించి వైసిపి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే ఎప్పటికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.