బాలికలతో మాట్లాడిన హోం శాఖ మంత్రి
విశాఖపట్నం – మంత్రి వంగలపూడి అనిత విశాఖ బాలికల సదన్ ను సందర్శించారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడ ఉంటున్న బాలికలతో మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 మంది ఉన్నారని, వారంతా శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. ఇద్దరిని ఇంటికి పంపించారని చెప్పారు.
మరో ఇద్దరిని బాలికల హోంకు పంపించారని తెలిపారు. ఇందులో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని అన్నారు. కొంత మంది చిన్నారులు ఉన్నారని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా విశాఖ బాలికల సదన్ లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. సదన్ ను సందర్శించిన అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. తన దృష్టికి కొందరు బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించడం జరిగిందన్నారు. ఈ మేరకు సదన్ నిర్వాహకులను హెచ్చరించామన్నారు.
ఇదే సమయంలో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు పర్యవేక్షించేలా చేయాలని ఆదేశించారు మంత్రి వంగలపూడి అనిత.