రైతులకు అందుబాటులో ఉండండి
ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి – రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు.
తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలని అన్నారు. రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు మంత్రి. అంతే కాకుండా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తుపాను కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.