Thursday, April 3, 2025
HomeNEWSANDHRA PRADESHనష్ట పోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం

నష్ట పోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి – రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు కొన్నిచోట్ల అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందన్నారు. గత అయిదేళ్లలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఒక్క ఏడాది కూడా ఆదుకోలేదన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అకాల వర్షాలతో నష్టపోయి రోడ్డున పడ్డా పరిహారం అందించకుండా జగన్ రెడ్డి విలాసాల కోసం వేలకోట్లు వృధా చేశారని ఆరోపించారు. తాము పంట న‌ష్ట పోయిన రైతును ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం అందించి రైతులకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు అచ్చెన్నాయుడు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారని చెప్పారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 మేర ఇన్ పుట్ సబ్సిడీ అంద జేయడంతోపాటు మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టారుకు రూ.75 వేలు ఇస్తామ‌న్నారు. మొత్తం రూ.1,10,000 వరకు సాయం అందుతుందని స్ప‌ష్టం చేశారు మంత్రి.

ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులు ఉంటాయన్నారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలో ఎన్యూమరేషన్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దు, ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకూ అండగా నిలబడుతుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments