నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెంనాయుడు
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, వర్షం కారణంగా గోడ తడిసి బలహీనపడి, భక్తులపై కూలిపడింది. ఈ దుర్ఘటనలో కొందరు అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుందన్నారు. క్యూలైన్లను క్రమబద్ధీకరించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసిందన్నారు.
రెస్క్యూ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు మంత్రి. ఈ గోడ ఉత్సవ సమయంలో మాత్రమే తాత్కాలిక క్యూలైన్‌గా ఉపయోగించ బడుతుందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించ బడిందన్నారు. అలాగే, దేవాదాయ శాఖ పరిధిలో ఆయా కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించామన్నారు.