Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHఏ హోదా అయినా ప్ర‌జ‌లే ఇస్తారు

ఏ హోదా అయినా ప్ర‌జ‌లే ఇస్తారు

మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి – మాజీ సీఎం జ‌గ‌న్ పై సిరియ‌స్ కామెంట్స్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏం సాధించార‌ని వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. సోయి లేకుండా వైసీపీ నేత‌లు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఏ పార్టీకైనా లేదా ఏ నాయ‌కుడికైనా ప్ర‌జ‌లే స్వయంగా హొదా క‌ల్పిస్తార‌ని , అది తెలుసు కోలేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌క పోతే అసెంబ్లీకి రాన‌ని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. ఇందుకోస‌మేనా మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ద‌ని అన్నారు.

సోమ‌వారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు శాస‌న స‌భ నియ‌మ‌వాళిని పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ముందు నుంచీ గౌర‌వించ‌కుండా వ‌స్తున్న ఘ‌న‌త వైసీపీకి వ‌ర్తిస్తుంద‌న్నారు.

ఒక బాధ్య‌త క‌లిగిన నాయ‌కుడిగా ఉన్న మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల త‌ర‌పున మాట్లాడ‌కుండా ఏకంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని బాయ్ కాట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యానికి మీరు ఇచ్చే విలువ అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైన వైసీపీకి ఎలా ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కుతుంద‌ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments