Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHవైసీపీ నిర్వాకం అచ్చెన్న ఆగ్ర‌హం

వైసీపీ నిర్వాకం అచ్చెన్న ఆగ్ర‌హం

చంద్ర‌బాబు కృషి వ‌ల్ల‌నే ఆర్థిక ప్యాకేజీ

అమ‌రావ‌తి – మంత్రి అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. వైసీపీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ రెడ్డి ఐదేళ్ల కాలంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప‌ట్టించుకున్నాడా అని ప్ర‌శ్నించారు. అవినీతి, అక్ర‌మాల‌కు తెర లేపి రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన ఘ‌న‌త త‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌జ‌లు అందుకే వైసీపీకి చెంప ఛెళ్లుమ‌నిపించేలా 11 సీట్ల‌కే ప‌రిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇక‌నైనా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌పడేలా సూచ‌న‌లు ఇవ్వాల‌న్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించడాన్ని అన్ని పక్షాల పార్టీలు ఆహ్వానిస్తుంటే… చంద్రబాబు ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని కడుపు మండి వైసీపీ మరోసారి తన కుట్ర బుద్ధిని చూపిస్తుందని ధ్వ‌జ‌మెత్తారు.

ఉత్తరాంధ్ర మాజీ మంత్రి బొత్ససత్యనారాయణకు సిగ్గు శరం లేవని… ఉత్తరాంధ్రకు ఊపిరి అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఐదేళ్ల పాటు ఏం ఉద్యమం చేశాడో ఆయన చెప్పాలన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి… ఇప్పుడు నీతలు చెబుతున్నారని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక పోరాటాలు చేసిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే స్వాగతించాల్సింది పోయి తప్పుడు కూతలు కూయడం వైసీపీ నేతలకే చెల్లింద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments