NEWSANDHRA PRADESH

విత్త‌నాల కొర‌త లేకుండా చూడాలి

Share it with your family & friends

ఫోక‌స్ పెట్టామ‌న్న మంత్రి అచ్చెన్న‌

అమ‌రావ‌తి – రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలు ప్రతి రైతుకూ అందుబాటులో ఉండేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మంగ‌ళ‌వారం ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రైతులకు విత్తన కొరత ఎక్కడ ఏర్పడినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. అంతే కాకుండా ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల ప‌నితీరుపై ఆరా తీశారు మంత్రి.

విత్తన కొరత ఇబ్బందులు ఏర్పడితే సంబంధిత అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయ‌న్నారు. శ్రీకాకుకళం జిల్లాలో రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

తక్షణమే వంశధార పనులు ప్రారంభించాలని స్ప‌ష్టం చేశారు. నీటి కొరత ఉన్న భూములకు (డ్రై ల్యాండ్, మెట్ట ప్రాంతాలు) సాగు నీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సాగు నీటి కాలువల్లో నీటి సరఫరాకు అడ్డుగా ఉన్న పూడిక తొలగించేందుకు మరమ్మతులు చేప‌ట్టాల‌న్నారు.