మత్స్య సంపదను మరింత పెంచాలి
ప్రణాళిక తయారు చేయాలన్న మంత్రి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మత్స్య శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. మత్స్య పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు.
రాష్ట్రంలో అపారమైన మత్స్య సంపద ఉందన్నారు. దానిని గుర్తించి ఏ మేరకు వాటిని ఉపయోగించు కోగలమనే దానిపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు మంత్రి. మత్య సంపదను వృద్ది చేసేందుకు కావాల్సిన వసతులు , అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నం చేయాలన్నారు.
ఇదే సమయంలో మత్స్య సంపద ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు అచ్చెన్నాయుడు. ఇదిలా ఉండగా మత్స్యకారులందరికీ రాయితీ పథకాలు వర్తింప చేస్తామని చెప్పారు. ఎవరూ లబ్దిదారులు నష్ట పోవడానికి వీలు లేదన్నారు.
అయితే లబ్దిదారుల ఎంపిక నిష్పక్ష పాతంగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులను గుర్తించేందుకు పారదర్శకంగా రీసర్వే చేపట్టాలని ఆదేశించారు కింజారపు అచ్చెన్నాయుడు.