ఆశాల ధర్నా వెనుక రాజకీయ కుట్ర
షాకింగ్ కామెంట్స్ చేసిన దామోదర
హైదరాబాద్ – రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది కాక తమపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ఆశా వర్కర్ల ఆందోళన చేపట్టడం వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు మంత్రి దామోదర రాజ నరసింహ. వారి ఉచ్చులో పడవద్దని కోరారు. తమ ప్రభుత్వం ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు.
ధర్నా చౌక్ ను మాయం చేసిన వాళ్లు ఆశాలకు అండగా ఉంటామని అనడం విడ్డూరంగా ఉందన్నారు దామోదర రాజ నరసింహ. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ప్రభుత్వంతో సహకరించాలని, విధులకు హాజరు కావాలని విన్నవించారు ఆరోగ్య శాఖ మంత్రి. చిల్లర మల్లర రాజకీయాలు చేయొద్దంటూ ప్రతిపక్షాలను కోరారు.