స్పష్టం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్ – రాష్ట్రంలో ఏ ఒక్కరు తాగు నీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేశారు మంత్రి దాసరి సీతక్క. మిషన్ భగీరథపై సమీక్ష చేపట్టారు. వచ్చేది ఎండా కాలం కావడంతో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
వచ్చే 5 నెలల కోసం ప్రణాళిక రూపొందించు కోవాలని స్పష్టం చేశారు. వేసవి ముగిసేంత వరకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతి రోజూ అందాల్సిందేనని అన్నారు సీతక్క.
నీటి పారుదల శాఖతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, సమస్యలు తెలుసు కోవాలని అన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి.
ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్దంగా ఉండాలని, ఎక్కడి నుంచి ఎవరెవరు చేస్తున్నారనే దానిపై కూడా క్లారిటీ ఉండాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలన్నారు దాసరి సీతక్క.