Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHకాలేజీ ఘ‌ట‌న వెనుక వైసీపీ కుట్ర

కాలేజీ ఘ‌ట‌న వెనుక వైసీపీ కుట్ర

మంత్రి డోలాశ్రీ వీరాంజ‌నేయ స్వామి

అమ‌రావ‌తి – ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్న ఘ‌ట‌న వెనుక వైసీపీ కుట్ర దాగి ఉందంటూ సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

శ‌నివారం ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో లేని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారి చేయాలని ఆదేశించారు మంత్రి.

వర్షంలో తడుస్తూ హాస్టల్ లోని మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించారు డోలాశ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి. అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు, అపరిశుభ్రతపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు ఈ దుస్థితి ఏర్ప‌డింద‌ని ఆరోపించారు. జగన్ కనీసం వసతి గృహాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నిధులు మంజూరు చేయ‌క పోవ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు. అధికారం పోయాక ప్రజలపై లేని ప్రేమను ఒల‌క బోస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు మంత్రి.

తప్పుడు ప్రచారాలు చేయడం, ఎదుటి వారిపై బురద చల్లడం వైసీపీకి దిన చ‌ర్య‌గా మారింద‌ని మండిప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments