స్కామ్ ల వల్లనే ఆప్ ఓటమి పాలైంది
ఢిల్లీ – ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆప్ ని ఓడించాలంటే మోడీ ఇంకో జన్మ ఎత్తాలంటూ సెటైర్ వేశారన్నారు. 2025లో కాదు కదా 2050లో కూడా తమపై గెలవలేరన్నారు. ఎన్నికల ఫలితాల ముందు కూడా అహంకారంతో అసత్య ప్రచారాం చేశారంటూ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, ఆప్ ఎమ్మెల్యేల కుంభకోణాల కారణంగానే వాళ్లు ఓటమి పాలయ్యారని అన్నారు. ఇకనైనా తమ తప్పులు తెలుసుకుంటే మంచిదంటూ హితవు పలికారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. మొత్తం 70 సీట్లకు గాను 47 సీట్లను సాధించింది కమలం పార్టీ. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన పవర్ ను కోల్పోయింది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేక పోయింది.
ఈ సందర్బంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవమిస్తామని అన్నారు.