వైసీపీకి ధర్నా చేసే హక్కు లేదు
మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్
అమరావతి – రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన చేసే హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. జగన్ రెడ్డి హయాంలోనే పదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆరోపించారు. తాము పెంచింది కాక బట్ట కాల్చి తమ మీద వేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీ జిమ్మిక్కులను, జగన్ రెడ్డి కపట నాటకాలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన జగన్ రెడ్డి హయాంలోనే జరిగిందని అన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయని, ఆ విషయం దాచిపెట్టి తమపై బురద చల్లాలని చూస్తే ఎలా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు గొట్టిపాటి రవికుమార్.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు. ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు మంత్రి.