Saturday, May 24, 2025
HomeNEWSANDHRA PRADESHఇచ్చిన హామీలు నెర‌వేరుస్తున్నాం

ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తున్నాం

మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కామెంట్స్

అమ‌రావ‌తి – కూట‌మి స‌ర్కార్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని చూస్తే తెలుస్తుంద‌న్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంద‌న్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుంద‌ని చెప్పారు. రిలయన్స్ సీబీజీ ప్లాంట్లతో ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని స్ప‌ష్టం చేశారు గొట్టిపాటి ర‌వికుమార్.

బుధ‌వారం గొట్టిపాటి ర‌వికుమార్ మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ చీఫ్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. గుజరాత్ తరువాత అత్యధిక ప్లాంట్లు ఏపీలోనే రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. సీబీజీ ప్లాంట్ ద్వారా బంజరు భూములు వినియోగంలోకి రానున్నాయని అన్నారు. ప్రభుత్వ భూములకు ఎకరాకు రూ. 15 వేలు, ప్రైవేట్ భూములకు 31 వేలు కౌలు చెల్లిస్తున్నారని చెప్పారు. .

రాష్ట్రంలోని సోలార్ పెట్టుబడిదారులను గత ప్రభుత్వం తరిమి కొట్టింద‌న్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులను ఆహ్వానిస్తోందని స్ప‌ష్టం చేశారు గొట్టిపాటి ర‌వికుమార్. కందుకూరు నియోజకవర్గంలో ఇండోసోల్ ప్లాంట్ తో పాటు బీపీసీఎల్ ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్ల‌డించారు. అతి త్వరలోనే డీఎస్సీ ద్వారా 16 వేల టీచరు ఉద్యోగాలను భర్తీ చేస్తామ‌న్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments