Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డులు పెట్టండి

ప‌ర్యాట‌క రంగంలో పెట్టుబ‌డులు పెట్టండి

ఆహ్వానించిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి – ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా ఏపీని తీర్చి దిద్దేందుకు త‌మ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జర్మనీ పర్య‌టిస్తున్నారు. భార‌త రాయ‌బారితో భేటీ అయ్యారు. పెట్టుబడికి అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, బలమైన పర్యాటక మౌలిక సదుపాయాలతో, ఆంధ్రప్రదేశ్ ప్రయాణ, ఆతిథ్య రంగంలో వ్యాపారాలకు అసమానమైన అవకాశాలను అందిస్తుందని వివరించారు.

పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఏపీ పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలు, వనరులు, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ- 2024-29 విధి విధానాలు, రాష్ట్ర భౌగోళిక అంశాలు, పెట్టుబడి అవకాశాలపై వెల్లడించారు.

ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. స్థిరమైన, సాంకేతికత ఆధారిత పర్యాటక అభివృద్ధికి అపారమైన సామర్థ్యంతో అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను హైలైట్ చేశారు.

అంతర్జాతీయ పర్యాటకులకు కీలకమైన ఆకర్షణలుగా ఉన్న1000 కి.మీల సుదీర్ఘ విశాల సముద్రతీరం, అందమైన బీచ్ లు, ఎత్తైన హిల్ ప్రదేశాలు, విభిన్న ప్రకృతి రమణీయ ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక కట్టడాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మంత్రి దుర్గేష్ నొక్కి చెప్పారు.

పర్యావరణ పర్యాటకం, బీచ్ టూరిజం, వారసత్వ పర్యాటకం, లగ్జరీ హాస్పిటాలిటీ, స్మార్ట్ టూరిజం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను ప్రభుత్వం ఆశిస్తుందన్నారు. తదుపరి తరం ప్రయాణికులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ఏఐ-ఆధారిత పర్యాటక అనుభవాలు, డిజిటల్ గైడ్ వ్యవస్థలు, పర్యావరణ అనుకూల రిసార్ట్‌లను అభివృద్ధి చేస్తోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments