NEWSANDHRA PRADESH

చేసిన త‌ప్పుల‌కు మూల్యం త‌ప్ప‌దు

Share it with your family & friends

ఏపీ మంత్రి కొల్లు ర‌వీంద్ర షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీ ఎక్సైజ్, గ‌నుల శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ప్ర‌జ‌లు ఛీ కొట్టినా ఇంకా బుద్ది మార లేద‌న్నారు. వైసీపీ వైఖ‌రి చూస్తుంటే సిగ్గు అనిపిస్తోంద‌న్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి ఆలోచ‌నా విధానంలో ఎలాంటి మార్పు రాక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఆయ‌న ఇంకా ప‌వ‌ర్ లోనే ఉన్నార‌ని అనుకుంటున్నార‌ని , క‌ల‌ల్లో బ‌త‌క‌డం మాను కోవాల‌ని సూచించారు కొల్లు ర‌వీంద్ర‌. చేసిన త‌ప్పుల‌కు మూల్యం చెల్లించుకునే రోజులు వ‌చ్చాయ‌ని అన్నారు.

కావాల‌ని ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. కార్ల‌ను అంతా చూస్తూ ఉండ‌గానే ద‌గ్ధం చేశార‌ని వాపోయారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ఇష్టానుసారంగా అధికారం ఉంది క‌దా అని దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు.

పాపం చేసిన వాళ్లు, దాడుల‌కు పాల్ప‌డిన వాళ్లకు శిక్ష ప‌డి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు కొల్లు ర‌వీంద్ర‌. పేర్ని నాని సొల్లు క‌బుర్లు చెప్ప‌డంలో దిట్ట అంటూ ఎద్దేవా చేశారు.