మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్
అమరావతి – మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు జగన్ రెడ్డిపై. ఆయన ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగాలు అవసరం లేదన్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో జగన్ అసెంబ్లీకి రాకుండా మొఖం చాటేశాడని ధ్వజమెత్తారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపాడన్నారు. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా అంటూ ప్రశ్నించారు. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిల్చోపెట్టిన జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు.
శుక్రవారం గుడివాడ టిడిపి కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదన్నారు.
మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారన్నారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పినా.. రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి యార్డ్ కి వెళ్ళాడని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి మాట్లాడించడం విడ్డూరంగా ఉందన్నారు. కొడాలి నానికి అంత సీన్ లేదన్నారు. తను కూడా అరెస్ట్ కావడం ఖాయమన్నారు.