స్పష్టం చేసిన మంత్రి పార్థసారథి
అమరావతి – భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారధి. త్రాగు నీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. అవసరాల మేరకు భద్రత చర్యలు , సమాచార, సహాయ సహకారాల కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియ జేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా , మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.
రెవెన్యూ, పోలీసు, విద్యుత్, మెడికల్,అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులందరూ సమన్వయంతో పని చేసి నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం, త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు, నూజివీడు నియోజకవర్గంలో హార్టికల్చర్ , మామిడి పంట నష్ట వివరాలు పూర్తి నివేదిక సమర్పించాలన్నారు, అవసరం మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలన్నారు, ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల అంతరాయం తక్షణమే నివారించాలన్నారు. అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు,