Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHక్రిస్మ‌స్ వేడుక‌ల్లో మంత్రి కొలుసు

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో మంత్రి కొలుసు

క్రిష్టియ‌న్ల అభివృద్దికి స‌ర్కార్ తోడ్పాటు

అమ‌రావ‌తి – క్రిస్మ‌స్ పండుగ సంద‌ర్బంగా జ‌రిగిన వేడుక‌ల్లో పాల్గొన్నారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నూజివీడు నియోజకవర్గం తుమ్మగూడెం గ్రామంలోని ఆర్.సి.ఎం చర్చి నందు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం క్రిస్టియ‌న్ల అభివృద్దికి నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. అన్ని వ‌ర్గాల‌ను ఆదుకుంటామ‌న్నారు.

ఎవ‌రూ కూడా ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు త‌మ నాయ‌కుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. గ‌త ప్ర‌భుత్వం క్రిస్టియ‌న్ల కోసం ఎలాంటి స‌హాయ స‌హ‌కారం చేయ‌లేద‌ని వాపోయారు.

క్రిస్మ‌స్ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు గాను స‌ర్కార్ తోడ్పాటు అందిస్తోంద‌ని చెప్పారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. తాము ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం అందించేందుకు స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments