NEWSANDHRA PRADESH

100 రోజుల్లో 1.55 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం

Share it with your family & friends

గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థ‌సార‌థి

అమ‌రావ‌తి – రాష్ట్రంలో యుద్ద ప్రాతిప‌దిక‌న ఇళ్ల నిర్మాణం చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. ఈ ఏడాది 7 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. అంతే కాకుండా రానున్న 100 రోజుల్లో 1.55 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మిస్తామ‌ని చెప్పారు.

2029 నాటికీ ఇళ్లు లేని ప్రతి పేద వారికి పక్కా గృహం నిర్మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా 4 వేల 500 కోట్ల రూపాయల నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందని ఆరోపించారు.

పేద వాళ్ల‌ సొంతింటి కల కల గానే మిగిలి పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2016 నుండి ఇప్పటి వరకు పేదలకు 21 లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పేదవానికి సొంతింటి కలను నెర వేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.

పట్టణ‌ ప్రాంతాలలో అమృత్ నిధులు, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ జల జీవన్ మిషన్ నిధుల ద్వారా మౌలిక వసతులు క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పారు మంత్రి. ఇళ్లు లేని అర్హులైన సుమారు 11 లక్షల మంది పేదలకు ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు.