విద్యుత్ భారం జగన్ రెడ్డిదే పాపం
మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్
అమరావతి – గత ఐదేళ్లతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్ రెడ్డిదేనని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకి రూ.1400 కోట్లు ముట్టజెప్పారని, కేపీహెచ్పీలో 10 ఎకరాలను జగన్ బినామీలు కొట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో రూ.50 వేల కోట్ల అప్పులు తమ మీద మోపారంటూ వాపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక పోతున్నామన్నారు.
శనివారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కొలుసు పార్థసారథి. 2014 – 2019లో చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి జగన్ చేతిలో పెడితే చివరకు నాశనం చేశారంటూ వాపోయారు.
దొంగే దొంగ దొంగ అని అరిచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీల పెంచారంటూ వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు కొలుసు పార్థసారథి. విద్యుత్ వ్యవస్థను జగన్ రెడ్డి సర్వ నాశనం చేశారని ఆరోపించారు. ప్రజల క్షేమాన్ని పట్టించు కోలేదన్నారు.