చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్ – అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు మంత్రి పొంగులేటి.
కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోక్యం చేసుకుని పల్లా కోరిన కోరిక న్యాయమైనదని, దానిని నెరవేర్చాలని పొంగులేటిని కోరారు. చేర్యాలతో పాటు మక్తల్, ఆలేరును కూడా రెవిన్యూ డివిజన్లు చేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
సభ్యుల నుంచి వచ్చిన వినతులను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో వచ్చే సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక లబ్దిదారులను ఎంపిక చేస్తాంమని చెప్పారు మంత్రి.