కాంగ్రెస్ మంత్రుల ఆరోపణ
ఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కాం ఆప్ కొంప ముంచేలా చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్ చేశారు. అందుకే జనం ఆప్ ను నమ్మలేదని, బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. బీజేపీ జనాన్ని హామీల పేరుతో బురిడీ కొట్టించడంలో సక్సెస్ అయ్యిందన్నారు. అవినీతిపై యుద్దం చేస్తానని ప్రకటించిన కేజ్రీవాల్ చివరకు అవినీతి, అక్రమాలకు ఆప్ ను కేరాఫ్ గా మార్చారంటూ ధ్వజమెత్తారు.
లిక్కర్ స్కాం వల్లనే కేజ్రీవాల్ దారుణంగా ఓటమి పాలయ్యారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత కొంప ముంచిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం కారణంగా ఆప్ ఓడి పోయింద్నారు. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
బీజేపీ సీనియర్ నేత పర్వేశ్ వర్మ దెబ్బకు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కారణంగా మాజీ ముఖ్యమంత్రికి షాక్ తగిలిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఈ స్కాం కారణంగా కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ , సంజయ్ ఆజాద్ సింగ్ జైలుకు వెళ్లారని ఇదే ఆప్ ను అధికారానికి దూరం చేసిందంటున్నారు. మరో వైపు కవిత రెండు నెలల పాటు జైలుకు వెళ్లి బెయిల్ పై బయట ఉన్నారు. లిక్కర్ స్కాం ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ను పవర్ కు దూరం చేసింది.