DEVOTIONAL

టీటీడీ నిర్ల‌క్ష్యం కొండా సురేఖ ఆగ్ర‌హం

Share it with your family & friends

తెలంగాణ భ‌క్తుల ప‌ట్ల క‌క్ష త‌గ‌ద‌ని ఫైర్

తిరుమ‌ల – తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. కుటుంబ స‌మేతంగా శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే టీటీడీ తెలంగాణ ప్రాంతానికి చెందిన భ‌క్తుల ప‌ట్ల అనుస‌రిస్తున్న వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తెలంగాణ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సంబంధించిన సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించడం లేదంటూ వాపోయారు. తెలంగాణ‌లోని దేవాల‌యాల‌లో ఏపీకి చెందిన వారి లేఖ‌లు స్వీక‌రిస్తున్నార‌ని కానీ టీటీడీలో వాటిని కావాల‌ని ప‌క్క‌న పెట్ట‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ తెలంగాణ భ‌క్తుల‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి ఏక‌రువు పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీటీడీని ఆదేశించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు.

ఇదే స‌మ‌యంలో మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌మ ప్రాంతానికి చెందిన భ‌క్తుల ప‌ట్ల అనుస‌రిస్తున్న టీటీడీ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. మ‌రి చైర్మ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటారా లేక మౌనంగా ఉంటారా అన్న‌ది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *