Saturday, May 24, 2025
HomeNEWSANDHRA PRADESHపిఠాపురం జ‌న‌సేన‌కు ఆధారం

పిఠాపురం జ‌న‌సేన‌కు ఆధారం

స్ప‌ష్టం చేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీకి పిఠాపురం మ‌ధుర‌మైన జ్ఞాప‌కంగా మిగిలి పోయేలా చేసింద‌న్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు వేదిక కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. పార్టీని ఆశీర్వ‌దించి అధికారంలో భాగ‌స్వామ్యం చేసేలా చేసిన ఘ‌న‌త ప్ర‌జ‌ల‌కు ద‌క్కింద‌న్నారు. వారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో నిర్వహిస్తున్నామని, దీనికి పార్టీలోని ప్రతి ఒక్కరూ మమేకం కావాలని పిలుపునిచ్చారు. స‌భ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ చేయాల‌ని కోరారు.

ఆసాంతం పరిశీలించి తగు సూచనలు అందించారు. సభా ప్రాంగణం మొత్తం కలియ తిరిగి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఏ కమిటీ ఎలా పని చేయాలి? ఎక్కడ పని చేయాలి అన్న వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. కమిటీల సభ్యులకు తగు సూచనలు అందించారు. అనంతరం రాష్ట్ర నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో సభా ప్రాంగణంలోనే నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. కేవలం పిఠాపురం నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, రాష్ట్రంలోని నలువైపుల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments