NEWSANDHRA PRADESH

కోటి 40 ల‌క్ష‌ల కుటుంబాల‌కు బియ్యం

Share it with your family & friends

పంపిణీ చేస్తున్నామ‌న్న మంత్రి మ‌నోహర్

కాకినాడ – ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అర్హులైన పేద‌ల క‌డుపు నింపేందుకు త‌మ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. మంగ‌ళ‌వారం ఆయ‌న కాకినాడ పోర్టును సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా గ‌త ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు.

ఇదిలా ఉండ‌గా జూన్ 28, 29 తేదీల‌లో పేదలకు అందించాల్సిన బియ్యాన్ని కోటి 40 లక్షలు కార్డు దారులకు అందిస్తున్నామ‌ని చెప్పారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

గత 5 సంవత్సరాల నుంచి పేదల బియ్యాన్ని వివిధ రకాల పేరుతో ఊహించని విధంగా కాకినాడ పోర్టును అడ్డ గా మార్చుకుని ఎగుమతి చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి.

కాకినాడ పోర్టు ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయ లేదంటూ స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కాకినాడ పోర్టును అవినీతికి అడ్డాగా మార్చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గతం లో చేసిన దాడుల్లో భాగం గా 50 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేశామ‌న్నారు. అందులో 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పేద‌ల‌కు అందించే బియ్యంగా తేలింద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్. నిందితుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.