డేటా సెంటర్ ను ఏర్పాటు చేయండి
దావోస్ – మంత్రి నారా లోకేష్ దావోస్ లో బిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దిగ్గజ కంపెనీ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిన్ కాట్సౌదాస్‌ను కలిశారు. సంభావ్య సహకారాల గురించి చర్చించారు. విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (GCC)ని స్థాపించాలని, ఆంధ్రప్రదేశ్‌లో వారి తయారీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని లోకేష్ ప్రతిపాదించారు. ఐటీ సెక్టార్ లో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎంఐ, నైపుణ్య అభివృద్ది కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలని కోరారు లోకేష్.
రాష్ట్రంలో విస్తారమైన ఐటీ టాలెంట్ పూల్ దాగి ఉందన్నారు. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఫోకస్ పెట్టాలని సూచించారు. అమెరికా వెలుపల సిస్కో యొక్క అతిపెద్ద గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ బెంగళూరులో ఉందన్నారు.
భారతదేశంలోని సమర్థవంతమైన మానవ వనరులను ఉపయోగించు కోవడానికి కంపెనీ విస్తరించాలని ఆసక్తిగా ఉందని కాట్సౌదాస్ పంచుకున్నారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆమె తాము చేసిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడానికి అంగీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.