ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
మార్చి 1 నుంచి పరీక్షలు
అమరావతి – విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విడుదల చేశారు. వచ్చే ఏడాది 2025 మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు పరీక్షలపై ఫోకస్ పెట్టాలని, ఫలితాలలో దేశంలోనే నెంబర్ వన్ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా డ్రాపవుట్స్ లేకుండా ఉండేందుకు , విద్యార్థులు కాలేజీలకు వచ్చేందుకు గాను మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. దీని వల్ల విద్యార్థులలో మరింత చదువుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నట్లు తెలిపారు. మరింత నాణ్యమైన విద్యను అందించాలని, కీలకమైన సంస్కరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా ప్రాక్టికల్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నారు.