అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
అమరావతి – రాష్ట్రంలోని యూనివర్శిటీలకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రాజకీయాలకు కేరాఫ్ గా మార్చారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక ప్రతిభ, నిబద్దత కలిగిన వారిని వీసీలుగా నియమించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు యూనివర్శిటీ ప్రగతిపై ఫోకస్ పెట్టామన్నారు.
వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలో టాప్ -100లో ఏపీకి చెందిన యూనివర్శిటీలు ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.
బుధవారం అసెంబ్లీలో విద్యా రంగానికి సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నారా లోకేష్.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9వస్థానం నుంచి 3వ స్థానానికి తేవాలని సీఎం చెప్పారని అన్నారు. ఈ సందర్బంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కలికిరిలో సుమారు రూ.650 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల భవనాలు నిర్మించడం జరిగిందన్నారు.
హైవే నెం.75పై పెద్దఎత్తున ఇన్ ఫ్రాస్ట్చక్చర్ ఉంది. కలికిరి ఇంజనీరింగ్ కాలేజిని యూనివర్సిటీ స్థాయికి పెంచాలని కోరారు. పూర్వం అన్ని యూనివర్సిటీలు తిరుపతిలో కట్టారని, కుప్పంలో ద్రవిడ యూనవర్సిటీ ఉందని తెలిపారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇంజనీరింగ్, ఫార్మా కాలేజిలు పెట్టి తమ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. నెల్లూరులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి, ఆర్ట్స్ కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు.
నెల్లూరు విక్రమ సింహపూరి యూనివర్సిటీలో 130 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉందన్నారు. యూనివర్సిటీలో తాగునీటి సమస్య పరిష్కరించండి, హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… పీలేరులో పాదయాత్ర చేసినపుడు కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను చూపించారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని మేం భావిస్తున్నామని చెప్పారు.