Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHసీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగు పరుస్తాం

సీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగు పరుస్తాం

వలసల నివారణకు చ‌ర్య‌లు తీసుకుంటాం

అమరావతి : రాష్ట్రంలో సీజ‌నల్ హాస్ట‌ళ్ల ప‌నితీరును మెరుగు ప‌రుస్తామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్‌. తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర చేప‌ట్టిన సంద‌ర్బంగా ఆలూరు, ఆదోని ప్రాంతాల నుంచి వ‌ల‌స వెళ్ల‌డం చూశాన‌ని అన్నారు. ఒకే వాహ‌నంపై 200 మంది వెళ్ల‌డం గ‌మ‌నించాన‌ని , అవ‌న్నీ చూశాక త‌న‌కు బాధ క‌లిగింద‌న్నారు. ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి, సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చామ‌న్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. విద్యా, వైద్యం, సాగు నీరు అందించ‌డంపై ఫోక‌స్ పెడుతున్నామ‌న్నారు.

నంద్యాల తర్వాత నేను కర్నూలుకు పాదయాత్రకు వెళ్లానని, రెండు ప్రాంతాల నడుమ ఎంతో వ్యత్యాసం కన్పించిందన్నారు. కర్నూలు జిల్లాలో శివారు ప్రాంతాలకు సైతం సాగు, తాగునీరు అందించడమే మా లక్ష్యమ‌న్నారు నారా లోకేష్‌. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో, లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్నది వాస్తవమ‌న్నారు. అందుకే రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువమంది ఉపాధ్యాయులు రాబోతున్నారని చెప్పారు. విద్యార్థులకు అపార్ ఐడి ని కేంద్రం మ్యాండేట్ చేస్తోందన్నారు.

కెజి నుంచి పిజి వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామ‌న్నారు ఇందుకు అవసరమైన ఐటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను తయారు చేస్తున్నామ‌న్నారు. ఒక్కరు కూడా డ్రాపవుట్ కాకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామ‌న్నారు. సీజనల్ హాస్టల్స్ కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు, హాస్టల్ వసతులు లేవు. కరువు ప్రాంతాల్లో ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments