ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి – మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పాలిటిక్స్ లోకి రాక ముందు పాల వ్యాపారం చేశానని చెప్పారు. ఏ పని చేసినా దానిపై మనసు పెట్టి చేస్తే సక్సెస్ వస్తుందన్నారు. తాను రాజకీయాలలోకి రావాలని అనుకోలేదన్నారు. కానీ అనుకోకుండా పాలిటిక్స్ లోకి వచ్చానని చెప్పారు. ఎందుకంటే ఏ రంగంలోనూ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగదన్నారు. కేవలం రాజకీయాల ద్వారానే సాధ్యవుతుందని అన్నారు నారా లోకేష్. గో సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరు గోవులను కాపాడు కోవాలని, ఆ బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి.
శుక్రవారం మంత్రి నారా లోకేష్ నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ వృత్తిని తక్కువగా చూడ వద్దని కోరారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా పాడి రైతులకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు నారా లోకేష్. గోవులు ఎక్కడ ఉన్నా వాటికి గ్రాసం పెట్టాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచి మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. మీ రుణం ఎలా మరిచి పోగలనంటూ ప్రశ్నించారు.