అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలపై లోకేష్ ఫైర్
అమరావతి – మంత్రి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేశారని కానీ కనిపించకుండా పోయారని సెటైర్ వేశారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీకి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారంటూ ప్రశ్న సంధించారని కానీ సమాధానం చెప్పినా వినేందుకు ఎమ్మెల్యేలు సిద్దంగా లేక పోవడం తనను బాధ పెట్టిందన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, అమర్ నాథ్ రెడ్డి, విరూపాక్షి, మత్స్యలింగం ఎందుకు ప్రశ్నలు వేశారో వారికేమైనా తెలుసా అని ప్రశ్నించారు నారా లోకేష్. ఈ సందర్బంగా జోక్యం చేసుకున్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు. కనీసం అసెంబ్లీకి రాక పోయినా పర్వా లేదు . మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానం గురించి ఇంట్లోనైనా టీవీల్లో చూస్తే బావుంటుందంటూ హితవు పలికారు.
శాసన సభకు రాకుండా ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా నారా లోకేష్. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల మేరకు కట్టుబడి ఉంటామన్నారు. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు..అసెంబ్లీకి రావాలని, మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత నాది అని మరోసారి పేర్కొన్నారు నారా లోకేష్.