Friday, May 23, 2025
HomeNEWSANDHRA PRADESHఆధునీక‌ర‌ణ ప‌నులు వేగ‌వంతం చేయాలి

ఆధునీక‌ర‌ణ ప‌నులు వేగ‌వంతం చేయాలి

మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ

అమ‌రావ‌తి – క్రీడా మైదానాల్లో జ‌రుగుతున్న ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. నెల్లూరులో ప‌ర్య‌టించిన మంత్రి పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి..క్రీడా మైదానాల్లో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. కూట‌మి ప్ర‌భుత్వం విద్యా రంగానికి అత్య‌ధికంగా బ‌డ్జెట్ లో నిధుల‌ను కేటాయించింద‌ని చెప్పారు. మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చొర‌వ‌తో హ‌డ్కో కింద భారీ ఎత్తున న‌గ‌రాభివృద్దికి నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు నారాయ‌ణ‌.

శ‌నివారం నెల్లూరు నగర పరిధిలోని చిన్న బాలయ్య నగర్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల, బివిఎస్ స్కూలు, ఆర్ ఎస్ ఆర్ ఉన్నత పాఠశాల, నవ పేట బివిఎస్ గర్ల్స్ హై స్కూల్, పప్పుల వీధి వైవి ఎంసి హై స్కూల్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల క్రీడా మైదానాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.. పలు సూచనలు ఇచ్చారు.

2014-19లో 1100 కోట్ల హడ్కో నిధుల ద్వారా నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి ఏర్పాట్లు ప్రారంభించి 90 శాతం పూర్తి చేస్తే, ప్రభుత్వ మార్పుతో మిగిలిన 10 శాతం పనులు ఆగి పోయాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రూ.165 కోట్ల హడ్కో నిధులను కేంద్రంతో చర్చించి తెచ్చామ‌న్నారు. త్వరలో మిగిలిన పనులను పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, అడిషనల్ కమిషనర్ నందన్, హెల్త్ ఆఫీసర్ చైతన్య, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మామిడాల మధు, కువ్వారపు బాలాజీ, గురుబ్రహ్మం గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments