రహదారుల అభివృద్దికి పెద్దపీట
మంత్రి నిమ్మల రామా నాయుడు
అమరావతి – రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు . పాలకొల్లు నియోజకవర్గం లో సిఆర్ఐఎఫ్ నిధులు రూ.25 కోట్లతో పాలకొల్లు- మార్టేరు ప్రధాన ఆర్ అండ్ బి రహదారి విస్తరణ, పటిష్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
బుధవారం నిమ్మల రామా నాయుడు మీడియాతో మాట్లాడారు. ఉల్లంపర్రు నుంచి మార్టేరు వరకు 11 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న 22 అడుగుల రహదారిని 33 అడుగులకు విస్తరిస్తామని చెప్పారు. నిధులకు ఎక్కడా కొదవ లేదన్నారు. గత ప్రభుత్వం గ్రామాలను, పట్టణాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
ఇదే సమయంలో రహదారుల అభివృద్దితో పాటు మౌలిక సదుపాయల కల్పన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గతంలో కంటే ఈసారి బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు.