వల్లభనేని వంశీకి మద్దతు ఇస్తే ఎలా
అమరావతి – ఆడబిడ్డలపై నోరు పారేసుకున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ వెనకేసుకు రావడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. అసలు నీకు సిగ్గు అనేది ఉందా అని సీరియస్ అయ్యారు. దళితులు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన వంశీకి మద్దతు పలకడం దారుణమన్నారు.
రౌడీలు, గుండాలు, గంజాయి, డ్రగ్స్ వంటివి ప్రోత్సహించడం జగన్ బ్రాండ్ అంటూ ఎద్దేవా చేశారు. అరాచకాలను అంతమొందించడమే చంద్రబాబు బ్రాండ్ అంటూ పేర్కొన్నారు. చట్ట ప్రకారమే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కగా అమలవుతుందని స్పష్టం చేశారు.
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నిమ్మల రామానాయుడు. వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకత్వం, రౌడీయిజాన్ని జగన్ రెడ్డి ఖండించక పోగా… ఈరోజు వంశీని పొగడటం చూస్తే దొంగే ఇంకొక దొంగను ఆదరించినట్టుగా ఉందన్నారు. ఒక అరాచక వాదిని ఇంకొక అరాచక వాది కౌగిలించుకునే పరిస్థితి ఈ రోజు తనలో కనిపిస్తోందన్నారు.
ఇలాంటి విష సంస్కృతి కలిగిన జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు కదా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశాడని ఆరోపించారు.