మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్
అమరావతి – మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. గత వైసీపీ జగన్ సర్కార్ కావాలని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2014-19 లో హంద్రీ నీవా కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే 2019-24 వైసీపీ హయాంలో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవా పనుల మాట అటుంచి కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయులు పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన 3850 క్యూసెక్కులు సామర్థ్యం ఉన్న మోటార్లను కుడా గత ప్రభుత్వం ఉపయోగించు కోలేక పోయిందన్నారు.
2025 జూన్ కల్లా హంద్రీనీవా పనులు పూర్తి చెయ్యాలని చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. అందువల్లనే రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా , కనీ విని ఎరుగని రీతిలో , ఈ ఏడాది బడ్జెట్ లో అత్యధికంగా హంద్రీనీవాకు 3243 కోట్ల రూపాయలు కేటాయుంచడం జరిగిందని స్పష్టం చేశారు. రాయలసీమకు కృష్ణా , గోదావరి జలాలు తరలించి , రతణాల సీమగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.